'కన్నప్ప' చిత్రంతో ప్రీతీ ముకుందన్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన బ్యూటీ. అప్పటికే టాలీవుడ్ లో 'ఓం బీం భుష్ 'అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా? ఆ సినిమా రీచ్ అవ్వకపోడంతో ప్రీతీ పేరు ఎక్కడా బయటకు రాలేదు. అలాగని 'కన్నప్ప' హిట్ చిత్రం కాదు. మంచు ఫ్యామిలీ సినిమా కావడం సహా పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రచారం దక్కడంతో? ప్రీతీ ముకుందన్ పేరు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. నెమలి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంత్ర ముగ్దుల్నిచేసింది. ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమాలో ఛాన్స్ అందుకోలేదు.
కానీ ఈ బ్యూటీ చాప కింద నీరులా బాలీవుడ్ లో కూడా విస్తరిస్తుంది. ఏకంగా ఓ సినిమా షూటింగ్ ని సైతం క్లైమాక్స్ కు తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఇంతకీ ఏంటా సినిమా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా మృగ్ దీప్ సింగ్ లాంబా 'నాగ్జిల్లా' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్లగా చాలా మంది భామల్ని పరిశీలించారు. కానీ ఎవర్ని ఎంపిక చేసారు ? అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో హీరోయిన్ స్థానం ఇంకా ఖాళీగానే ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ స్థానంలో ప్రీతీముకుందన్ ఎంపిక చేసి సైలెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.